15మంది విద్యార్థులకు అస్వస్థత
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
బయట చెబితే అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరింపులు
నిర్వాహకుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆగ్రహం
సిద్దిపేట అర్బన్, జూలై 5: సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి గ్రామ శివారులో గల సురభి వైద్య కళాశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం బయటకు చెబితే విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేస్తామని నిర్వాహకులు బెదిరించడంతో బయటకు రాలేదు. ఫుడ్ పాయిజన్‌తో 15మంది విద్యార్థులు రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ వంట గదిని పరిశీలించిన విద్యార్థులకు కాలం చెల్లిన నిత్యావసర సరుకులు, కుళ్లిన కూరగాయలు దర్శనమిచ్చా యి.
లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ నాసిరకం కూరగాయలతో తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలను సందర్శించగా లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. విద్యార్థులు అస్వస్థతకు గురై రెండు రోజులు గడుస్తున్నా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కలెక్టర్ వెంటనే కళాశాలను సందర్శించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సంఘాల నాయకులు కోరారు. ఈ విషయంపై కళాశాల సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తాను సెలవులో ఉన్నట్లు తెలిపారు. కళాశాల నిర్వాహకులు అందుబాటులోకి రావడం లేదు.
20 మంది విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్: వికారాబాద్‌సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (అనంతగిరిపల్లి)లో శుక్రవారం 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు సమాచా రం. మధ్యాహ్నం సమయానికి విద్యార్థుల సంఖ్య ఎక్కువవడంతో పాటు కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో సిబ్బంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ ఆసు పత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు కారణం తాగునీరు లేదా ఉదయం తీసుకున్న అల్పాహారం అయి ఉండవచ్చని వైద్యు లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో వసతి గృహానికి పంపించారు.