calender_icon.png 26 October, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంట్లవెల్లి కస్తూర్బాలో ఫుడ్‌పాయిజన్!

05-08-2024 01:54:47 AM

30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): పురుగుల అన్నం, చపాతి తిని కేజీబీవీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. పెంట్లవెల్లి కస్తూర్బా పాఠశాలలో ఆదివారం రాత్రి 8గంటలకు విద్యార్థు లకు చపాతీలు, భోజనం వడ్డించారు. పురుగులు వచ్చాయని విద్యార్థులు మొత్తుకున్నా పట్టించుకోకుండా సిబ్బంది గద్దించడంతో విద్యార్థులు వాటినే తిన్నారు. అరగంట తరువాత కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

30 మందికి పైగా విద్యార్థులు అనా రోగ్యానికి గరికావడంతో తేరుకున్న ఎస్వో స్వప్న 108 అంబులెన్సు సాయంతో కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక్క అంబెలెన్సు సరిపోకపోవడంతో 102 వాహనాల్లోనూ తరలించారు. ప్రస్తు తం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ అధికా రులను ఆదేశించారు.