- 31 మంది విద్యార్థినులకు అస్వస్థత
- ఢిల్లీ నుంచి ఆరా తీసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జనవరి 7 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని శర్మనగర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి విద్యార్థినులకు సాంబార్, గోబిపువ్వు కూరతో ఆహారాన్ని అందించారు. రాత్రి 11 గంటల సమయంలో విద్యార్థినులకు వాంతులు, వీరోచనాలు కావడంతో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమ 23 మంది విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం 20 మందిని తిరిగి గురుకులానికి పంపించగా, మంగళవారం ఉదయం మరో 8 మంది అస్వస్థతకు గురికావడంతో ఆసపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ నుంచి కరీంనగర్ కలెక్టర్ ప సత్పతికి ఫోన్‌చేసి ఆరా తీశారు. భోజ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సంజయ్ సూచన మేరకు బీజేపీ నేతలు ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినులు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి వివరించారు. అస్వస్థతకు గల కారణాలను విశ్లేషించి నివేదిక అందజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ విద్యార్థినులను పరామర్శించారు. అధికారులపై, ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్‌సీవో అంజలిని సస్పెండ్ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు కోరారు.