calender_icon.png 5 October, 2024 | 11:09 PM

ప్రైవేటు గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

05-10-2024 01:10:21 AM

15 మందికి అస్వస్థత

జనగామ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలకు సంబంధించిన హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధ పడుతున్న వారిని హాస్టల్ యాజమాన్యం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తోంది.

జనగామలోని బతుకమ్మ కుంట సమీపంలో గాయత్రి జూనియర్ రెసిడెన్సీ బాలికల కళాశాల నడుపుతున్నారు. గురువారం రాత్రి హాస్టల్‌లో పిల్లలకు పాలకూర పప్పుతో భోజనం పెట్టారు. అన్నం తిన్న వి ద్యార్థినులకు కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పి రావడంతో ఆందోళనకు గురయ్యా రు. మరికొందరు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.

సుమారు 15 మం ది అస్వస్థతకు గురికావడంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీ రిని   ఎన్‌ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ ప రామర్శించారు. కాలేజీ యాజమా న్యం నిర్ల క్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈ నెల 2 నుంచే దసరా సెలవులు ప్రకటించినా గాయ త్రి కాలేజీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ, హాస్టల్ నడుపుతోందని ఆయన విమర్శించారు. కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వారం క్రితం మరో హాస్టల్‌లో

వారం రోజుల క్రితమే జనగామ పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాలకు సంబం ధించిన బాయ్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. కల్తీ భోజనం తిని ఐదారుగురు వి ద్యార్థులు వాంతులు చేసుకోగా గుట్టుచప్పు డు కాకుండా చికిత్స చేయించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, విద్యా శాఖ అధికారులు ఇలా ంటి కాలేజీలపై నిఘా పెట్టాలని విద్యార్థి సం ఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.