మానకొండూరు (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో నలుగురి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. ఎల్ఎండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరణ్య, కళ్యాణి, నందినితో పాటు మరో ఐదుగురు విద్యార్థినిలు బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసి సాయంత్రం సమీపంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోకి వెళ్లారు. కొంత సమయం తర్వాత వారికి కడుపునొప్పి రావడంతో సమీపంలోని ప్రైవేటు వైద్యం వద్ద చూపించారు. అందులో నలుగురికి కడుపునొప్పి తగ్గకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.