calender_icon.png 12 March, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్

10-03-2025 12:33:17 AM

  • 72 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు తెలిపిన విద్యార్థులు

కుంట్లూరులోని నారాయణ బాసర హాస్టల్ ఘటన

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 9: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూర్ లోని నారాయణ బాసర ఐఐటీ క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది  72 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.కుంట్లూరులోని నారాయణ బాసర క్యాంపస్ లో   శనివారం రాత్రి ఆదివారం ఉదయం చపాతితో కూడిన ఆలుకూర్మ తినడంతో పలువురు విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు.

దీంతో మోషన్స్ వాంతులతో ఇబ్బందులు పడ్డారు.కళాశాల యాజమాన్యం వైద్యులను తీసుకువచ్చి ఓఆర్‌ఎస్, కొబ్బరి బొండాలతో తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను తమను చూసుకోనివడం లేదని తమ పిల్లల దగ్గరకు వెళ్దామంటే ఒప్పుకోవడం లేదని తిడుతు న్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

వేలకు వేలు ఫీజులు కట్టి ఇక్కడ మా పిల్లలను చదివిస్తుంటే.. కార్పొరేట్ విద్యాసంస్థలలో మా పిల్లలకు ఏమీ జరిగిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అసలే ఇప్పుడు వేసవికాలమని... అందులో పరీక్షలు కూడా జరుగుతున్నా... విద్యార్థులకు ఎలాంటి ఫుడ్ పెట్టాలని.. ఎలాంటి ఫుడ్ పెట్టొదని కనీసం అవగ హన లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆరోపించారు.

క్యాంపస్ సిబ్బందిని వివరణ కోరగా... మా క్యాంపస్‌లో ఎలాంటి ఘటనజరగలేదని తొసిపుచ్చారు. క్యాంపస్‌లోకి వెళ్లి విద్యార్థులను వివరణ అడుగుతామని మీడియా ప్రతినిధులు అడుగగా... వారిని క్యాంపస్‌లోకి అనుమతి ఇవ్వలేదు.  గంటల కొద్ది అక్కడే  వేసిచూశారు. సమాచారం తెలుసు కున్న హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు సంఘటన వచ్చారు. 

పోలీసులు, మీడియా ప్రతినిధులందరూ కలిసి క్యాంపస్‌లోకి వెళ్లి ఫుడ్ పాయిజన్ సంబంధించి విద్యార్థులను అడుగగా.. స్టూడెంట్స్ మాట్లా డుతూ... క్యాంపస్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకునే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది నిజమేనని అన్నారు.

ఫుడ్ పాయిజన్ అయిన వారు దాదాపు మొత్తం 72 మంది విద్యార్థుల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు వెల్లడించారు.  అదేవిధంగా కొహెడ క్యాంపస్ లో కూడా ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మహిళ విద్యార్థినిలు కావడంతో వారిని మగ వైద్యులతో చూపిస్తున్నాడంతో తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు.