calender_icon.png 11 January, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

09-01-2025 12:39:34 AM

మానకొండూరు, జనవరి 8: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం  ఎల్‌ఎండీ కాలనీలోని ప్రభు  ఉన్నత పాఠశాల సమీపంలోని ఇంటిగ్రేటెడ్  హాస్టల్‌లో నలుగురి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. ఎల్‌ఎండీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అరణ్య కళ్యాణి, నందినితోపాటు మరో ఐదుగురు విద్యార్థినులు బుధవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసి సాయంత్రం సమీపంలోని హాస్టలకు వెళ్లారు. కొంత సమయం తర్వాత వారికి కడుపునొప్పి రావడంతో సమీపంలోని ప్రైవేటు వైద్యుడికి చూపించారు. అందులో నలుగురికి కడుపునొప్పి తగ్గకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.