calender_icon.png 12 January, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంట్లవెల్లి కేజీబీవీలో మళ్లీ ఫుడ్ పాయిజన్!

06-08-2024 04:48:55 AM

  1. ఈసారి నలుగురు టీచర్లు, 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత 
  2. మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

నాగర్ కర్నూల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి కేజీబీవీలో మళ్లీ ఫుట్ పాయిజన్ జరిగింది. ఈసారి నలుగురు ఉపాధ్యాయులతో పాటు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులను పరామర్శించి ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు సోమవారం మధ్యాహ్న భోజనంలో కలెక్టర్ బాధావత్ సంతోష్, డీఈవో గోవిందరాజులు విద్యార్థులతో పాటే భోజ నం చేశారు.

కానీ, ఆ సమయంలో తిన్న వారికి ఎలాంటి ఇబ్బంది జరగలేదని.. రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మాత్రమే ఫుడ్ పాయిజన్ జరగడం పట్ల అధికారులు అయోమయంలో పడ్డారు. ఫుడ్ పాయిజన్ జరగడానికి గల కారణాలను తెలుసుకోవడంలో అధికారులు కూడా విఫలం చెందారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు.