calender_icon.png 28 November, 2024 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహారం వేడిగా ఉండాలంటే!

28-11-2024 12:00:00 AM

చలికాలం వచ్చేసింది.. చల్ల చల్లని వాతావరణం.. చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినాలని కోరుకుంటారు చాలామంది. ఈ సీజన్‌లో అతి పెద్ద సమస్య ఏమిటంటే.. వంట చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆహారం చల్లగా అయిపోతుంది. ఆహారాన్ని ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలేంటో చూద్దాం.. 

ఈ సీజన్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అదే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. చలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వెచ్చదనం కలిగించే దుస్తులు ధరిస్తాము. ఆహారం వండిన వెంటనే ఆహారం చల్లబడుతుంది. అన్నం, పప్పు, కూరలు ఇలా ఏవైనా సరే తక్కువ సమయంలోనే చల్లబడతాయి.

వాటిని మళ్లీ మళ్లీ వేడి చేయడం చాలా పెద్ద పని. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు నాశనం అవుతాయి. ఆహారాన్ని వేడి చేయడానికి బదులుగా కింది వస్తువుల్లో భద్రపరుచుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. 

ఇత్తడి పాత్రలు

చలికాలంలో కంచు లేదా ఇత్తడితో చేసిన పాత్రలలో ఆహారాన్ని ఉంచవచ్చు. చలికాలంలో ఆహారాన్ని గోరువెచ్చగా ఇవి ఉంచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆహారాన్ని వెచ్చగా ఉంచడమే కాదు భోజనానికి మంచి రుచిని కూడా అందిస్తాయి. 

థర్మల్ బాక్స్ 

థర్మల్ బాక్స్‌ల సహాయంతో ఆహారాన్ని వేడిగా ఉంచవచ్చు. థర్మోప్లాస్టిక్ నుంచి థర్మల్ బ్యాగులను తయారు చేస్తారు. ఈ బాక్స్ లోపల ఆహార పదార్థాల గిన్నెలను పెట్టిమూత పెడితే ఆహారంలోని వేడిని ఈ బాక్స్ బయటకు వెళ్లనివ్వదు. దీనివల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. 

అల్యూమినియం ఫాయిల్ 

ఆహారాన్ని వేడిగా ఉంచడానికి తరచుగా అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగిస్తాం. దాని పొర ను ఆహారం వండిన పాత్రపై ప్లేట్ లా కవర్ చేస్తే.. ఎక్కువ సమ యం ఆహారం వేడిగా ఉంటుంది. అలాగే రోటీలు, పరాటాలు అయితే పేపర్ ర్యాప్‌లో పెట్టి చుట్టండి. ఇలా చేయడం వల్ల ఉదయం చేసిన రోటీ లు మధ్యాహ్నం వరకు వేడిగా ఉం టాయి.