calender_icon.png 27 December, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బువ్వ బాలేదు.. సదువు సక్కగ లేదు

18-09-2024 03:45:57 AM

  1. హాలియాలో బీసీ గురుకుల విద్యార్థినుల నిరసన 
  2. తరగతులు బహిష్కరించి ఆడిటోరియంలో బైఠాయింపు 
  3. విద్యార్థి సంఘం నేతలతో కలిసి ఎమ్మెల్యేకు వినతి 
  4. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ 

నల్లగొండ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): పాఠశాలలో భోజనం బాగాలేదని, తరగతుల నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నదని హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం తరగతులను బహిష్కరించి ఆడిటోరియంలో బైఠాయించారు. భోజనంలో పురుగులు వస్తున్నాయ ని, సాంబార్ నీళ్లమయంగా ఉంటుందన్నారు.

ఆకలితో అలమటిస్తున్నా అధికారు లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా గుడ్లు, పాలు అందడం లేదని ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోయారు. విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందించారు.