19-04-2025 12:18:43 AM
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం (వరల్ లివర్ డే) సందర్భంగా శుక్రవారం ‘ఆహారమే ఔషధం’ అని చెపు తూ సరైన ఆహారపు అలవాట్లతో కాలేయా న్ని రక్షించవచ్చని హైదరాబాద్‌లోని కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైజెస్టివ్ డిసీజెస్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ మహమ్మద్ నయీమ్ తెలిపారు.
ఎక్కువగా కూర్చునే జీవనశైలి, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, మద్యం వినియోగం, డాక్టర్ల సలహా లేకుండా మందుల వినియోగం కాలేయం దెబ్బతినడానికి కారణం కావచ్చన్నారు. ఆరోగ్యకరమై న జీవనశైలి లేకపోవడం వల్ల ఈరోజుల్లో యు వతలో కూడా కాలేయ సమస్యలు పెరు గుతున్నాయి.
ఆహారాన్ని ఔషధంగా భావించి ఆచరించటం కాలేయ రక్షణ కు అత్యంత కీలకం.‘ అని తెలిపారు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రాసెస్ చేసిన ఫుడ్, అధికంగా గరమైన తినుబండారాలు, కృత్రిమ రంగులు కలిగిన పానీయాల ను సేవించొద్దన్నారు.
తాజా ఆహారం, తక్కు వ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం కాలేయానికి మంచిదని చెప్పారు. విటమిన్ ఇ, సి, బి సమృద్ధిగా ఉన్న ఆహారం కాలేయాన్ని రక్షించడంలో దోహదపడుతుందని చెప్పారు. నీరు సమృద్ధిగా తాగితే డీటాక్స్ ప్రక్రియలో ఇది కీలకంగా ఉంటుందన్నారు.