21-02-2025 07:22:33 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కిరాణా షాపులు హోటల్స్ టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్వీట్ హౌస్ బేకరీలలో ఇష్ట రాజ్యాంగ నాసిరకమైన తినుబండరాలు సరుకులు ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్ముతున్నప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టడం లేదని చర్యలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ఏవో మధుకర్ కు డివైఎఫ్ఐ, టిఏజిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కార్తీక్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా ఉండకపోవడంతో షాపుల యజమానులు నాసిరకమైన తినుబండారాలు, కాలం చెల్లిన వస్తువులను అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పై,షాపుల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకమైన ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.