మాజీ ఎంపీ బాబూరావు
ఇల్లెందు, నవంబర్ 17: భూ పోరాటాలతో దేశంలో పేదవాడికి తిండి, బట్ట, గూడు లభించిందని మాజీ ఎంపీ మీడియం బాబూరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల సీపీఎం కార్యాలయం వద్ద ఆదివారం 7వ మండల మహాసభ నిర్వహించారు. మహాసభ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మీడియం బాబూరావు మాట్లాడు తూ.. భూమిపై ఉన్న సకల సమస్యలు పరిష్కారం కావాలంటే మార్క్సిజమే మార్గమని అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు శక్తులు ప్రభు త్వ రంగాలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ప్రజల్ని దోచుకుంటున్నాయని విమర్శించారు.
ఇటువంటి దోపిడీకి అనుకూల విధానాలు అవ లంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలపై సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ప్రజలందరికీ ఆర్థిక సమస్యలను సృష్టిస్తున్న విధానాలపై ప్రజా పోరాటాలకు పదును పెట్టాలని ఆయన అన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజె రమేష్ మాట్లాడుతూ.. భూ నిర్వాసితులు చేస్తున్న ఉద్యమా లు, కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం ఫలితంగా హైకోర్టు స్పందించిన తీరు అభినం దనీయం అన్నారు. మహాసభలో జిల్లా కమి టీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, మండల నాయకులు నరసింహారావు, కడుదుల వీరన్న, పూనెం స్వామి, పూనెం చంద్రశేఖర్, దొడ్డ సంపత్, పాయం వెంకన్న, రాంబాబు, రాంబాబు, జోగ దశరథ్, సావిత్రి, చుక్కమ్మ, కిషోర్ పాల్గొన్నారు.