03-03-2025 10:08:00 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కలంస్నేహం, సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, కన్వీనర్ సమత ఆద్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మహిళలు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వచించారు. వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొని రకాల రకాల రుచికరమైన వంటకాలతో, ఆటపాటలతో వీక్షకులను అలరించారు. న్యాయమూర్తులుగా సువర్ణ, భభిత పాల్గొని పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, కన్వీనర్ సమత మాట్లాడుతూ... మహిళలను చైతన్యవంతులను చేయడానికి, మహిళలలో పోటితత్వం పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు.