calender_icon.png 30 December, 2024 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకెనపల్లి పాఠశాలలో ఆహారోత్సవం

21-12-2024 04:32:27 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు తెలంగాణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల కోసం చేసే వంటకాలు పదిమందితో పంచుకునే అవకాశం ఆహారోత్సవం కార్యక్రమంలో ఉంటుందని  ఒకరోజు ముందే తల్లిదండ్రులకు తెలిపారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఒక వంటకాన్ని తయారుచేసి పాఠశాలకు తీసుకురావాలని ఉపాధ్యాయులు కోరారు.

ఫలాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, విటమిన్ ఏ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, మాంసాహారం, కోడిగుడ్లు లాంటి వాటితో వండిన సమతుల ఆహారం కోసం సమావేశం ఏర్పాటు చేసి పౌష్టికాహారంతో కూడిన ఆహారం తినడం వల్ల పిల్లల్లో ఎదుగుదల జ్ఞాపకశక్తి పెరిగి చురుకుతనంగా తయారవుతారని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జెర్రిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయురాలు కె.జ్యోతి, అంగన్వాడీ టీచర్ సాన పద్మ, ఆయన నరిగ శంకరమ్మ, తల్లిదండ్రులు లింగంపల్లి లతిక రాజేష్, తోకల శ్యామల, తోటపల్లి సుజాత, కంపెల శ్వేత, సిద్ధం సత్తెమ్మ, కుంటం బాలక్క, అజ్గర్ బి, ఏల్పుల మల్లు తదితరులు పాల్గొన్నారు.