సూర్యాపేట, విజయక్రాంతి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ గ్రామంలో దుర్గా యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం అమ్మవారిని చండీ దేవి రూపంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.