calender_icon.png 20 March, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

19-03-2025 10:59:15 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గంగూరి సంతోష్, తేజ దంపతుల కుమారుడు గుహాన్షు చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి తదుపరి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత సంతోష్ మాట్లాడుతూ.. మా బాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు, ఇలా అనాధ వృద్ధుల మధ్యన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం గా ఉందని, అలాగే గత 25 సంవత్సరాలుగా ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ సేవలు మరువలేనివి అని ముఖ్యంగా ఈ ఆశ్రమం వెలుగులోకి రావడానికి సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ క్రుషి అభినందనీయం అన్నారు.

ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా వార్తలు రాస్తూ ఆశ్రమం అబివృద్ధికి దోహదపడుతున్న ఈ ప్రాంత ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారానికి ధన్యవాదాలు అని, ఇలా ప్రతి ఒక్కరు స్పందించి ఈ ఆశ్రమానికి అండగా నిలిచి ఆశ్రమ అబివృద్ధికి సహకరించాలని అన్నారు. తదుపరి సూర్యాపేట పట్టణానికి చెందిన బోలగాని మల్లయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు బిక్షపతి ఉమ దంపతులు కమల హాస్పిటల్ వారు త్రిశక్తి వనితా గ్రూప్ సహకారంతో ఆశ్రమానికి వాటర్ ప్యూరిఫైర్ బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ, ముత్తవరపు రమేష్ త్రిశక్తి గ్రూప్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి కృష్ణ మూర్తి గుడుగుంట్ల విద్యాసాగర్ దంపతులు సీనియర్ సిటిజన్స్ నుంచి ఆరె రామకృష్ణ రెడ్డి, ముస్కుల గోవింద రెడ్డి ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.