calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

19-04-2025 07:29:12 PM

మునగాల: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మండల కేంద్రానికి చెందిన దేవరం శ్రీనివాస్ రెడ్డి-నిర్మల దంపతుల రెండవ కుమారుడు ఆకాష్ రెడ్డి జ్ఞాపకార్ధంగా ఆశ్రమంలోని వృద్ధులకు, అనాధలకు శనివారం పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తమ కుమారుడి జ్ఞాపకార్ధంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించి వృద్ధుల ఆకలి తీర్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆశ్రమంలోని వృద్ధులకు చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జి ఎస్ రెడ్డి సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకురాలు విజయమ్మ, జ్యోతి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.