14-04-2025 06:24:55 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం దళిత సంఘాల నాయకులు గజ్జల రామ్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు అన్నదానం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో చిలుముల శంకర్, కొట్టే వెంకటేష్, రాజనర్సు, దాసరి శివకృష్ణ, అభిలాష్ యాదవ్, సాయి కిరణ్ యాదవ్, దూడపాక మనోజ్, చింతల రాజకుమార్ లు పాల్గొన్నారు.