21-03-2025 02:01:23 AM
హైదారబాద్, మార్చి 20 (విజయక్రాంతి): అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం సుమారు 600 మంది పేద రోగుల సహాయకులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ యూనియన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శి వైదిక్ శాస్త్ర, సభ్యుడు ముఖీమ్ ఖురేషి, క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు బీ శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు సయ్యద్ వసీం అమీర్, సయ్యద్ రిజ్వాన్, ఏపీఆర్‌వో మహ్మద్ వహీద్, మహ్మద్ హబీబ్ చావుష్, మహ్మద్ అబ్దుల్ ముస్తఫా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించినట్టు ముజీబ్ తెలిపారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.