calender_icon.png 18 March, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీంకు సన్మానం

18-03-2025 01:34:11 AM

యాదాద్రి భువనగిరి మార్చి 17 (విజయ క్రాంతి): అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీల నిమిత్తం జిల్లా లోని రాయగిరి అంగన్వాడీ కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అతహర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరి నర్సింహా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.