calender_icon.png 25 December, 2024 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్‌సెంటర్లపైనా తనిఖీలు జరపాలి

25-10-2024 10:55:56 PM

తెలంగాణలో ఇటీవల హైదరాబాద్‌తో పాటు జిల్లాలలోని అనేక ప్రాంతాలలో రెస్టారెంట్లు, హోటల్లో  తయారు చేస్తున్న ఆహా ర పదార్థాలను అందులో ఉపయోగిస్తున్న వస్తువులను ఫుడ్ సేఫ్టీ స్థానిక సంస్థల అధికారులు పరిశీలిస్తున్నారు. నాసిరకమైన  కుళ్ళిపోయిన పదార్థాలను పరిశీలించి ఆయా యజమానులపై తగు చర్యలు తీసుకోవడం పాటు వాటిని  మూసివేస్తూ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు వార్తల్లో చూస్తున్నాం. ఇది చాలా హర్షణీయమైన  విషయం. ఈ పరిశీలనలు నిరంతర ప్రక్రియంగా కొనసాగి స్తూ, రుచి, శుచికరమైన ఆహారం అందించుటకు తోడ్పడి ప్రజల ఆరోగ్యాలను సంరక్షించడంలో మార్గదర్శకంగా నిలవాలి.ఇదే విధం గా వీధులలో నిర్వహిస్తున్న భోజనశాలలు, టిఫిన్ సెంటర్లలో కూడా ఫుడ్ సేఫ్టీ, స్థానిక సంస్థల అధికారులు కలిసి తరచుగా వారు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను వస్తువులను కూడా పరిశీలించాలి. ఈ వ్యాపారులు తక్కువ ధరకు ఆకలితో అలమటిస్తున్న వారి కి ఆహారం అందిస్తున్నా వాటి  నాణ్యత,శుభ్రతకు చర్యలు తీసుకున్నట్టు కనిపించవు. అందువల్ల అధికారులు వీటిపైనా దృష్టిపెట్టాలి.


 -దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్