calender_icon.png 31 October, 2024 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార కల్తీ క్షమార్హం కాదు

31-10-2024 12:00:00 AM

నేడు అన్ని రకాల ఉత్పత్తులలో నా ణ్యత లోపిస్తున్నది. కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులలో ఈ మధ్య దారుణాలు జరుగుతున్నాయి. నిల్వ చేసిన, కుళ్లిన ఆ హారపదార్థాలు విక్రయిస్తున్నారు. ప్ర జల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొన్న నగరంలోని స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు . అన్నీకాలం చె ల్లిన నాసిరకం సరుకులు వేసి తయారు చేసినవిగా గుర్తించారు. అలాగే చాలా స్వీట్ షాపులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సర్టిఫికెట్ కూడా లేకపోవడం దారుణం.

అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ స రుకు లతో తయారుచేసిన తినుబండారా లు తినడం వల్ల ప్రజలకు ఎంతో అ నారోగ్యాలు కలుగుతాయి. ఇటీవల రోడ్డుపై విక్రయిస్తున్న మొమోస్ తిని ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన చూశాం. మన దేశంలో ఆహార రంగంపై అసలు శ్రద్ధ వహించరు.  ఎ క్కడ ఎలా తయారు చేస్తారని కూడా ఆలోచించరు. అందుకే రోడ్డుపై తయారు చేసే చిరుతిండ్లు, హోటల్స్‌లో చేసే పదార్థాలలో కల్తీ జరు గుతోంది. అదే అమెరికాలాంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల విని యోగం లో కఠిన చట్టాలు ఉంటాయి.

అక్కడి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కొరకు తీవ్ర కృషి చేస్తాయి. ఇక్కడి మాదిరి నాణ్యత లేని కల్తీ ఆహార ఉత్పత్తులను ఏమాత్రం సహించరు. కానీ మన దేశంలొ ఏ మాత్రం పట్టించుకోరు. ఏదైనా జరిగితే వెంటనే హడావిడి చే స్తారు. నాలుగు రోజులకు మళ్లీ మామూలే. ప్రభుత్వం ఇకనైనా ఆ హార రంగంలో కఠిన చట్టాలు తేవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.

-శ్రిష్టి శేషగిరి,సికింద్రాబాద్.