నారాయణపేట, జనవరి 19 (విజయక్రాంతి): వాహనదారులు తమ వాహనాలకు సంబం ధించిన పెండింగ్ చలాన్ లను చెల్లించాలని ఎస్సై గాయత్రి అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.
చలాన్‌లను పరిశీలించి పెండింగ్ వున్న చలాన్‌లను వాహనదారుల నుండి వసూలు చేశారు. మొత్తం ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయ డం, వాహనాలకు ఛాలన్స్ విధించడం, పెండింగ్‌లో ఉన్న చాలన్స్ కట్టించడం జరిగిందని ఎస్ ఐ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని రకా ల పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించా లని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.