హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16(విజయక్రాంతి): ట్రాఫిక్ భద్రత, నియమాలపై నగరవాసులు అవగాహన పెంచుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌లో ట్రాఫిక్ భద్రత, మహిళల భద్ర, సైబర్‌క్రైమ్‌లపై అవగాహన కల్పించేందుకుగాను ఏర్పా చేసిన నగర పోలీసుల స్టాళ్లను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, ఇత ముఖ్యమైన సేవలకు ఉపయోగించే అధునాతన సాంకేతికతపై ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఈ స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు బీకే రాహుల్ హెగ్డే, ఎన్ అశోక్‌కుమార్, ఆర్ వెంకటేశ్వర్లు, సైబర్‌క్రైమ్ డీసీపీ డీ కవిత, మహిళా భద్రత వింగ్ డీసీపీ లావణ్య, అడిషనల్ డీసీపీ రామదాస్‌తేజ, ఏసీపీలు పాల్గొన్నారు.