calender_icon.png 17 January, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

17-01-2025 12:51:00 AM

మేడ్చల్ డీటీవో రఘునందన్ గౌడ్

మేడ్చల్, జనవరి 16(విజయ క్రాంతి): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డిటిఓ రఘునందన్ గౌడ్ అన్నారు. గురువారం మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ రూట్ లో నడపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐలు శిల్ప, సదుల్లా శ్రీనివాస్, త్రివేణి,  డాక్టర్ అగర్వాల్. క్యాంపు  ఇంచార్జ్.  సాయి పాల్గొన్నారు.