మేడ్చల్ డీటీవో రఘునందన్ గౌడ్...
మేడ్చల్ (విజయక్రాంతి): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డిటిఓ రఘునందన్ గౌడ్ అన్నారు. గురువారం మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ రూట్ లో నడపవద్దన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కేసులు నమోదవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ లు శిల్ప, సదుల్లా శ్రీనివాస్, త్రివేణి, డాక్టర్ అగర్వాల్ క్యాంపు ఇంచార్జ్ సాయి తదితరులు పాల్గొన్నారు.