calender_icon.png 5 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి నియమాలను పాటించాలి

02-01-2025 04:42:43 PM

భైంసా (విజయక్రాంతి): రహదారి నియమాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని బైంసా అంతర్ రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్ట్ ఎంవి ఐ దూప్ సింగ్ అన్నారు. బైంసా బోకర్ జాతీయ రహదారి 61పై తాండూరు మండలం బెల్థరోడా వద్ద గురువారం జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు మత్తు పదార్థాలు తీసుకొని, వాహనాలు నడుపుతూ సెల్ఫోన్ లో మాట్లాడడం ప్రధాన కారణం అన్నారు. డ్రైవర్లు మత్తు పదార్థాలు తాగి, సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలను నడపవద్దనరు.  రహదారులపై ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏ ఎం బి ఐ లు డ్రైవర్లు పాల్గొన్నారు.