రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
యాదాద్రి భువనగిరి జనవరి 31 (విజ య క్రాంతి): రోడ్డు భద్రతా నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పిలుపునిచ్చారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్స వాలలో భాగంగా జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా రెవిన్యూ అధికారి వీరా రెడ్డి,జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్,ఏ సి పి ప్రభాకర్ రెడ్డి, జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... మారిన ఆధునిక కాలంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్, కారులు ఉండడం సహజమని ఆయన అన్నారు. ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరింప జేస్తున్నాయాన్ని, సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా, డబుల్ ను ఫోర్ లైన్ గా, ఎక్స్ ప్రెస్ రోడ్లుగా విస్తరణ చేస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని దీనికి కారణం వాహనం నడిపే వారి నిర్లక్ష్యంమే అని ఆయన తెలిపారు.
వాహనాలు వేగంగా నడపడం ముఖ్యం కాదని అప్రమత్తంగా, నిబంధనలు పాటిస్తూ నడపక పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్ లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్ లు, సంభవిస్తాయని అన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే, వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్ళే ఇతరులకు కూడా ప్రమాదాలు జరగుతాయని, గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్ లు బాగా జరుగుతున్నాయని, ముఖ్యంగా యువకులు ఫోన్ మాట్లాడుతూ, వాట్సప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లు లు చూస్తూ ఏకాగ్రత లేక యాక్సిడెంట్ లకు గురవుతున్నారని అన్నారు.
యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబందించినది కాదు అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుంది, పూడ్చలేని బాధ, కష్టం అని పేర్కొన్నారు. యూరప్, అమెరికా వంటి దేశాలలో ప్రమాధాలు తక్కువగా జరుగుతాయి, కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబందనలను ఖచ్చితంగా పాటిస్తారని , మన దేశంలో కూడా రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మనవాళ్ళు సరిగ్గా పాటించడం లేదని ,టూ వీలర్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ దరించాలని స్పీకర్ సూచించారు.
సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70 శాతం తలకు దెబ్బ తగలడంతోనే మరణిస్తున్నారని, హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చని అదేవిదంగా కారు నడిపే వ్యక్తే కాదు కారులో ప్రయాణిస్తున్న అందరు సీట్ బెల్ట్ లు దరించాలన్నారు. సీట్ బెల్ట్ దరిస్తే కారు యాక్సిడెంట్ కు గురైనా, బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్ లు తెరుచుకుని అందులోని వారిని రక్షిస్తాయాన్నారు.
విద్యార్ధులకు చిన్నప్పటి నుండే రోడ్డు భద్రతపై అవగాహన కల్గించాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనందరి భాద్యత అని అప్పుడే ప్రమాధాలు జరగకుండా నివారించవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించడం జరిగింది .
రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వివిధ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాలలకు మరియు , ఇప్పటి వరకు ఎలాంటి యాక్సిడెంట్లు చేయకుండా ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ లకి సర్టిఫికెట్ల ను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ట్రాఫిక్ సిఐ మధుసూదన్, , రెడ్ క్రాస్ చైర్మన్ పురుషోత్తం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.