calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుచ్చలో మెళకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలి

18-03-2025 07:33:11 PM

చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్...

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పుచ్చ సాగు చేస్తున్న రైతులు సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలని చెన్నూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భాను ప్రసాద్ అన్నారు. మండలంలోని మందమర్రి(వి) శివారు బురుదగూడెంకు చెందిన యువరైతు చరణ్ సాగు చేస్తున్న పుచ్చకాయ క్షేత్రాన్ని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయితో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా పుచ్చకాయ విత్తనం వేయకముందు బాగా దుక్కి చేసి పశువుల ఎరువు వేసుకోవాలని, ఆరు ఇంచుల ఎత్తులో బెడ్లు తయారు చేసుకోవాలని, సమతుల ఎరువుల విధానాన్ని పాటించి సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.

పుచ్ఛలో రసం పీల్చు పురుగుల నివారణకు డైనోట్ ఫురాన్ వంటి మందులు ఎకరానికి 100 గ్రాములు, ముఖ్యంగా కలుపు లేకుండా చేసి సూక్స్మదాతు లోప నివారణకు ఫార్ములా 4 వంటి మందులు రెండు మూడు సార్లు అందించాలని సూచించారు. పుచ్చలో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుందని, బోరాన్ లోపం వలన కాయలు వంకర టింకరలుగా ఏర్పడి పగిలి పోయి నాణ్యత దెబ్బతింటుందన్నారు. లోప నివారణకు బోరాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి రెండు మూడు దఫాలుపై పాటుగా పిచికారీ చేసుకోవాలని ఆన్నారు.

రైతులు పంట మార్పిడి విదానాలు పాటించాలి..

మండలంలోని రైతులు పంట మార్పిడి విదానాలు పాటించాలని చేన్నూర్ ఎడిఎ బాణోత్ ప్రసాద్ అన్నారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పంట మార్పిడి చేయాలని, ఆయిల్ పామ్ సాగుకై మొగ్గు చూపాలని, ఇది ఒక్కసారి నాటితే ముప్పై సంవత్సరాల వరకు పంటనిస్తుందని ఆన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా పత్తి, పప్పు ధాన్యాల వంటివి సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.

నాలుగో సంవత్సరం నుండి ప్రతి ఎకరాలో రెండు టన్నులతో మొదలైన దిగుబడి ఐదు ఆరు సంవత్సరాల్లో పది టన్నులకు చేరి దాదాపు రెండు లక్షల నికర ఆదాయాన్ని ఇస్తుందని, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఉంటుందని తెలిపారు. అదే విదంగా పొలాలు, చేనుల్లో విద్యుత్తు హై టెన్షన్ లైన్ క్రింద వ్యవసాయ వ్యర్థాలను కాల్చరాదని, ఆయిల్ పామ్ సాగు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ కిరణ్మయి, ఏఈఓ లు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజు, మండల పరిధిలోని సారంగపల్లి, పొన్నారం, మామిడిగట్టు, చిర్రకుంట, ఆదిల్ పేట్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.