calender_icon.png 27 October, 2024 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఫోక్ స్టార్స్

14-05-2024 12:05:00 AM

ఒక్క పాటను పది రకాలుగా పాడి.. పల్లె భాషలో జనం గుండెల్లో నిలిపేదే జానపదం. జనం నచ్చిన పాటల్లో జానపదాలకు ప్రత్యేక గుర్తింపు. జానపద రిథమ్.. డీజే మిక్సింగ్‌లో వస్తున్న పాటలు ప్రస్తుతం యూట్యూబ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అప్లోడ్ చేసిన క్షణాల్లో లక్షల్లో వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాటిలో ప్రాణం పెట్టి పాడిన పాటలు కొన్నైతే.. జనం నాడికి కనెక్ట్ అయినవి మరికొన్ని. వీళ్ళ గొంతుకు అభిమానులు ఫిదా అవుతారు. 

తెలంగాణ కళరూపాల్లో ఒకటైనా జానపదాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఫోక్ స్టార్స్ మన తెలంగాణ బిడ్డలు   మామిడి మౌనిక, మౌనిక యాదవ్, వరం, లక్ష్మిలతో పాటు రేలారే రేలా గంగా, ప్రభ ఇలా ఎంతోమంది ఉన్నారు. అద్భుతమైన స్వరాలతో యూట్యూబ్‌లో తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న అలాంటి సింగర్స్ కొందరి గురించి ఇవాళ్టి ప్రత్యేక కథనం.

మామిడి మౌనిక

తెలంగాణ జానపదుల, పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒడవని ముచ్చట. అసొంటి పాటలు, బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా! సోషల్ మీడియా స్టార్.. బతుకమ్మ పాటల గాయని మౌనిక స్వరం విన్నకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం. జగిత్యాల దగ్గరలో చిన్నాపూర్ గ్రామానికి చెందిన మామిడి మౌనికకు పల్లె పదాలంటే మక్కువ. ‘మదన సుందారి’ అనే పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.  ఈ పాటకు 7.9 మిలియన్ వ్యూస్‌ని ఈ సాంగ్ రాబట్టడమే కాకుండా.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఈ పాట ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది మౌనిక. ‘నేనొస్తా బావా మల్లన్న పేట’.. పాటను స్వయంగా ఆమె రాసింది. ఆ తర్వాత ‘మదన సుందారి’.. ‘సువ్వీ సువ్వన్నెల్లారా’.. ‘ఉంగురం’.. ‘నెమళియ రాజ’.. ఇలా అనేక జానపద గేయాలు ఆమెకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చాయి. ఆ ఇష్టంతోనే ఆమే జానపద గీతాలు పాడటం నేర్చుకున్నారు. మేనమామ దగ్గర నుంచి జానపదాలు నేర్చుకున్న మౌనిక ఇప్పుడు సొంతంగా పాటలు కూడా రాస్తున్నారు. మౌనిక పాడిన జానపద గీతాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లక్ష్మి

లక్ష్మి.. మారాఠి, బంజారా, తెలుగు పాటలుపడుతూ..  యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచారు. తన అద్భుతమైన గొంతుకు జానపద ప్రియులు ఫిదా అవుతారు. హై పిచ్‌లో పాటను ఓ రేంజ్‌కి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఏడు వందల పాటలు పడింది. లక్ష్మికి బాగా గుర్తింపుని తెచ్చిన పాటలు ‘తిన్నతిరం పడుతలే..’, ‘ఓ బావ సైదులు’. ఇవి రెండు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటలు  యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ‘నువ్వుగుంజె గుంజడుకు గనుగుపూలు వూగుడుకు’, ‘పిల్లో శైలజా’,‘పచ్చని మా పల్లెటూరు’. లక్ష్మి పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్ వస్తాయి. 

మౌనిక యాదవ్

ఆమె ఒక్క పాట పడిందంటే చాలు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ షేక్ అయిపోతాయి. కోట్లల్లో వ్యూస్ వచ్చే స్తాయి. ఆమె గొంతుకు ఫిదా అవుతారు. ఫోక్ సాంగ్స్ ఇష్టపడేవాళ్ళకు పరిచ యం అక్కర్లేని పేరు ‘మౌనిక యాదవ్’. సై టీవీలో పడిన ‘మందు వెట్టినావురో రాములో రాములా’ పాట ద్వారా 100 మిలియన్ల వ్యూస్ అందుకొని జానపద గాయనిగా మంచి గుర్తింపునందుకుంది. అలా 70కి పైగా జానపద పాటలు పాడి 2021లో సొంతంగా ‘మౌనిక అఫీషియల్’ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి.. మాతృదినోత్సవం సందర్భంగా  ‘నెత్తుటి ముద్దయి.. నేలన పడ్డా.. కోటి నొప్పుల గురుతై పుడితివె అమ్మా.. ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే’ అనే పాట విడుదల చేసింది.

ఇలా సందర్భానుసారంగా జానపదులను విడుదల చేసి తనదైన ముద్ర వేసుకుంది. పుష్ప సినిమాలో ‘సామీ.. సామీ..’ అనే మాస్ సాంగ్ అప్పట్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో 24 గంటల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 10.2 మిలియన్ వ్యూస్‌ని ఈ సాంగ్ రాబట్టడమే కాకుండా.. ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ పాట ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది మౌనిక. హై పిచ్ గొంతుతో జానపద ప్రేమికులను మెప్పిస్తూ కొత్త కొత్త పల్లె పదాలతో అలరిస్తున్నది.

వరం

సింగర్ వరం స్వరం వింటే అభిమానుల్లో గూస్ బమ్స్ రాక తప్పవు. పాటకు ప్రాణం పెట్టి పాడుతుంది. ఇప్పటి వరకు 200కు పైగా జానపదాలు పాడారు. ‘బతుకమ్మ ఫిల్మోత్సవ్’లో అవార్డు వచ్చింది. గోరెటి వెంకన్న రాసిన తొలి పండుగ పాట ‘బొట్టూ బోనం’ పాడింది వరం. ‘గోదారిలోయ గొంతుక’, ‘సన్న సన్న బండాల మీద’, లస్కర్ ఉజ్జయిని మాంకాళి’, ‘సుక్కురారం మహాలక్ష్మి’ ఈ పాటలకు యూట్యూబ్‌లో విశేష స్పందనతో పాటు మిలియన్స్‌లో వ్యూస్ ఉన్నాయి. వరం పాడిన ప్రతి పాట ట్రెండింగ్‌లో ఉన్నావే.

మహబూబాబాద్ కేసముద్రం బేరువాడకు చెందిన వరిపల్లి వరలక్ష్మి.. అలియాస్ వరంకు చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. బాల్యంలో తండ్రి పద్యాలు పాడుతుంటే.. తానూ రాగం కలుపుతుండేది. అలా పాటలపై అమితమైన ప్రేమను పెంచుకోంది వరం. సామాన్య జన హృదయాలకు చేరువయ్యేలా, వినసొంపుగా పాడటం ఆమె ప్రత్యేకత. ఇలా ఆమె పాడిన జానపదాలు ఎన్నో.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వరం పాడిన బతుకమ్మ పాట అద్భుత ఆదరణ దక్కించుకుంది.

 రూప