ఆదిలాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అడవుల జిల్లా అదిలాబాద్‌ను సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. రాష్ర్టంలోనే ఆదిలా బాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమో దు కావడంతో చలి తీవ్రతకు వణికిపోతున్న ప్రజలను, దట్టమైన పొగమంచు మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారులపై ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. పొగమంచు కారణంగా కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు.