22-02-2025 01:02:26 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : జిల్లాలో ఆహార కల్తీని అరికట్టడంపై ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ఆహార భద్రత సమావేశంలో ఆమె మాట్టాడారు. చికెన్ విక్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధకశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
రెస్టారెంట్లు, హోటల్లు బడ్డీ కోట్లు, తోపుడు బండ్ల నిర్వాహకులు వాడిన నూనెను, ఎక్స్పైరీ పదార్థాలు వాడకుండా తరచూ దాడులు చేయాలని సూచించారు. నిబంధ నలు ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో 16 కేసులు నమోదైనట్లు తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్వాడీ కేంద్రాలు, జీజీహెచ్లో రోగులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేయాలని
మాతాశిశుమరణాలు తగ్గించాలి..
మాతా, శిశు మారణాలను తగ్గించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, అధికారులతో నల్లగొండ డివిజన్లో మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్ ద్వారా 80 శాతం మరణాలు అరికట్టవచ్చని చెప్పారు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకు ముందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డికి ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు.