calender_icon.png 30 April, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలి

30-04-2025 12:00:00 AM

జొన్నల కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని దాల్ మిల్ వద్ద మార్క్ పెడ్, ప్రజా మిత్ర, రైతు మ్యాక్ పెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంతో పాటు మట్టి పరీక్ష యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రసాయనాల వాడకం వల్ల భూసారం తగ్గి భూమికి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. రైతులు తాము పం డించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేపట్టాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీను వాడి సాగు చేయాలని అన్నా రు.

ఆర్గానిక్ పంటలను పండించాలని సూచించారు. మట్టి పరీక్షా యంత్రం రైతులకు అందుబాటులో వచ్చిందని, ప్రతి ఒక్క రైతు ఈ యంత్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ , వైస్ చైర్మన్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.