సీఎస్ శాంతికుమారి సమీక్ష
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు.
హైకోర్టు భవనాలు, తెలంగాణ భవన్, ఉస్మానియా ఆస్పత్రి, ప్రాంతీయ రింగ్‌రోడ్డు (ఉత్తరం), ఇందిరా మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాల నిర్మాణం, అకడమిక్ బ్లాక్‌లు, రెసిడెన్షియల్ జోన్‌ల ఏర్పాటు ప్రణాళికలపై సీఎస్ చర్చించా రు.
ఆస్పత్రి ప్రాంగణం పరిసరాలలోని పెట్రోల్ బంక్‌లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్‌ను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.