calender_icon.png 24 November, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయ వృద్ధిపై దృష్టి సారించాలి

26-09-2024 03:11:53 AM

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై నిరంతర తనిఖీలు చేపట్టాలి

ఇసుక, ఫ్లుయాష్ ఓవర్ లోడింగ్‌పై ఉపేక్షిస్తే సహించం 

 మంత్రి పొన్నం 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పనిచే యాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మ ంత్రి పొ న్నం ప్రభాకర్ అధికారులను ఆ దేశి ంచారు.

సెక్రటేరియట్‌లో బుధవారం రవాణా శాఖ అధికారులతో ఆ యన సమీక్ష నిర్వహించారు. ప్రభు త్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాల ని, ఆటోల లో విద్యార్థులను తీసుకొని ఓవర్ లోడ్‌తో కెళ్తున్న వారి ప ట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

రాష్ర్టంలో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలుమార్లు యూనిసెఫ్ బృందం సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. యూనిసెఫ్ సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో ప్రతి విద్యార్థికి రోడ్ సేఫ్టీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్క్రాప్ పాలసీ, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్‌పై అధ్యయన నివేదిక

స్క్రాప్ పాలసీ, ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్, ఇతర రవాణా పాలసీలను అధ్యయనం చేయడానికి రవాణా శాఖ అధికారుల బృం దం ఇప్పటికే వివిధ రాష్ట్రాలను సందర్శించింది. ఆయా ప్రాంతాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీపై ఒక సమగ్ర నివేదికను తయారు చేసిన అధికారులు దాన్ని మంత్రికి అంది ంచారు.

ఈ నివేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. మరోసారి తుది నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయాల జాబి తా తయారు చేయాలని మంత్రి ఆ దేశించారు. సమావేశంలో రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబత్రి తదితరులు పాల్గొన్నారు.