calender_icon.png 30 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రవాణాపై దృష్టి సారించాలి

07-07-2024 12:05:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): డ్రగ్స్‌పై రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి అధికారులను ఆదేశించారు. శనివారం నాంపల్లి ఆబ్కారీ భవన్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన హైదరాబాద్ డివిజన్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాల ప్రకారం కేసులను నమోదు చేయాలని చెప్పారు. డ్రగ్స్ రవాణా, అమ్మకం, వినియోగంపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అనుమతి లేని చోట్ల మద్యం విక్రయాలు జరగకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈవెంట్లలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్‌తో పాటు సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.