calender_icon.png 14 October, 2024 | 9:57 PM

డిపాజిట్ల సేకరణపై దృష్టి పెట్టాలి

20-08-2024 12:30:00 AM

బ్యాంకర్లతో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, సామర్ధ్యంపై కేంద్ర మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపాజిట్ల సేకరణ, డిజిటల్ చెల్లింపులు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ వంటి పలు అంశాలపై బ్యాంకుల పురోగతిని పర్యవేక్షించారు. 2023-24లో బ్యాంకులు అన్ని విభాగాల్లో మెరుగైన సామర్థ్యం కనబరచడంతో నిక ర నిరర్థ్ధక ఆస్తులు 0.76 శాతానికి తగ్గాయని సమావేశంలో వెల్లడైంది.

దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగైందని తేలింది. బ్యాంకుల సామ ర్థ్యం మెరుగవడంతో మార్కెట్ల నుంచి బ్యాంకులు మూలధనాన్ని సమీకరించే సామర్థ్యం కూడా పెరిగిందని గుర్తించారు. ఈ కాలంలో బ్యాంకులు ఏకంగా రూ. 27,830 కోట్ల డివిడెండ్‌ను వాటాదారులకు పంచాయి.

పరపతి వృద్ధికి అనుగుణంగా ఆ డిమాండ్‌ను అందుకునేందుకు డిపాజిట్ల సేకరణను పెంచాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం ద్వారా డిపాజిట్స్‌ను రాబట్టాలని ఆమె బ్యాంకులకు సూచించారు. కస్టమర్లను బ్యాంకు ఉద్యోగులు నేరుగా కలిసి వారితో అనుబంధం పెంచుకోవడంతో పాటు డిపాజిట్లను పెంచేందుకు వినూ త్న ఉత్పత్తులతో బ్యాంకులు ముందుకెళ్లాలని కోరారు.