- ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలలో సైన్స్ ఎక్స్ పో
మంచిర్యాల, జనవరి 28 (విజయక్రాంతి): విద్యార్థులు శాస్త్రీయ, సాంకేతిక రంగం వైపు దృష్టి సారించాలని, కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు.
మంగళవారం కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ (కేఐవైఈ), యార్లగడ్డ అభిరాం మెమోరియల్ గ్రామ సేవ సంయుక్తంగా శ్రీ ఉషోదయ పాఠశాలలో ఇన్స్పైర్ ఇండియా సాంకేతిక ప్రదర్శన, శాస్త్రీయ అవగాహన కార్యక్రమాన్ని డీఆర్డీవో మాజీ చైర్మన్, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు జీ సతీశ్‌రెడ్డి, కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
విద్యార్థులు అబ్దుల్ కలాం, సతీశ్‌రెడ్డి లాంటి వారి స్ఫూర్తితో ఇస్రో, డీఆర్డీవో సంస్థలలో చేరి ప్రభుత్వానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కేఐవైఈ ఫౌండర్ నరేశ్, ఇస్రో సైంటిస్ట్ శివశంకర్, డీఈవో ఎస్ యాదయ్య, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శేఖర్‌రావు,
జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, శ్రీ ఉషోదయ స్కూల్ ప్రిన్సిపాల్ వై బాలాజీ, అసోసియేటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, ట్రస్మా నాయకులు రాపోలు విష్ణువర్ధన్‌రావు, ఉదారి చంద్రమోహన్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, దుర్గాప్రసాద్, జాన్ థామస్, ప్రవీణ్, గోనె భాగ్యలక్ష్మి, శరత్ పాల్గొన్నారు.