మహబూబ్ నగర్, జనవరి 3 (విజయ క్రాంతి) : చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలనిజిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి.పాపిరెడ్డి అన్నారు. జాతీ య, రాష్ర్ట న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలోని సమావేశ మందిరంలో బాలల హక్కులు, చట్టాల అమలు, రక్షణ, సంరక్షణ వంటి అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యు లకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్య క్రమాన్ని జడ్జి ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి లోపాలు లేకుండా కృషి చేయాలన్నారు. రెండు రోజులపాటు ఇచ్చే శిక్షణలో బాలల హక్కులు, చట్టాలు, రక్షణ, సంరక్షణ వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.
స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం-2024లో భాగంగా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిర పర్యవేక్షణలో ప్యానల్ న్యాయ వాదులు, ప్యారా లీగల్ వాలంటీర్లు, లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులతో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ప్రకటించారు. అనంతరం వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉన్నారు