20-02-2025 05:45:07 PM
దస్తూరాబాద్: మండలంలోని ఆకొండపేట గ్రామ పంచాయతీని గురువారం ఎంపిడివో రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీని, పల్లె ప్రకృతి వనంను, పలు జిపి రికార్డులను పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారు చేయాలని సూచించారు. మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి నీటిని అందించాలని అన్నారు. మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.