17-03-2025 01:35:21 AM
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
చేవెళ్ల, మార్చి 16: స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. చేవెళ్లలో మాజీ డీసీసీ అధ్యక్షుడు పడాల వేంకట స్వామి కొడుకు సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ ఏర్పాటు చేసిన పీవీఎస్ హార్డ్వేర్ , ఎలక్ట్రానిక్స్ షాప్ను కాలె యాదయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఉపాధి రంగాల్లో రాణించాలని, వ్యాపారం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం ముఖ్యమని, యువత ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధిపై దృష్టిపెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, టిపిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, సీనియర్ నాయకులు మర్పల్లి కృష్ణారెడ్డి, పాండు గౌడ్, పండ్ల మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మంగలి యాదగిరి, మహేందర్ ముదిరాజ్ పాల్గొన్నారు.