హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మహానగర పరిధిలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారిస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. చెరువులన్నింటికీ అలుగులు ఉండేలా చర్యలు తీసుకుంటామ న్నారు. తద్వారా వానకాలంలో ఒక చెరువు నిండగానే, మరో చెరువు నింపుతామన్నారు.
నగరంలోని బుద్ధభవన్‌లో బుధవారం డి జాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తుల నిర్వహణపై తమ బృందం బెంగళూరుతో పాటు ఇతర ముఖ్యనగరాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుం దన్నారు. ఆ తర్వాత విధానాలను రూపొందిస్తామని వెల్లడించారు.
వరద ముంపు ప్రాంతాల్లో కాలువల ప్రవాహ స్థాయిని అంచనా వేసేందుకు బెంగళూరులో అమలు చేస్తున్న సెన్సార్ విధానాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రేటర్‌లో డివిజన్ల వారీగా వాతావ రణ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటామని, ఆ సమాచారాన్ని క్రోడీకరించి వర్షపాతం నమోదుతో పాటు వరద ముప్పును అం చనా వేస్తామన్నారు.
తద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. అనంతరం కర్నాటక ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ శ్రీనివాస్‌రెడ్డి బెంగళూరులో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిర్వహణపై అమలు చేస్తున్న విధాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.