calender_icon.png 23 September, 2024 | 3:04 AM

క్వాలిటీ ఎడ్యుకేషన్‌పె ఫోకస్!

23-09-2024 12:51:27 AM

  1. కేజీ నుంచి పీజీ వరకు సంస్కరణలు
  2. ప్రణాళికల రూపకల్పనలో విద్యా కమిషన్
  3. త్వరలో క్షేత్రస్థాయిలో పూర్తి అధ్యయనం
  4. వచ్చే విద్యాసంవత్సం నుంచి బోధనలో అమలు  
  5. హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కేరళ, విదేశీ విద్యావిధానాలు పరిశీలన

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాం తి): ప్రభుత్వ విద్యలో భారీ మార్పులు రానున్నాయి. ఇందుకు విద్యాకమిషన్ ప్రణాళికలు రచించబోతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు అందే క్వాలిటీ ఎడ్యుకేషన్‌పైనే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన విద్యాకమిషన్ ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు సమాచారం. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సంస్కరణలు చేపట్టనుంది.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూ నివర్సిటీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, మౌలిక వసతులు, సిలబస్, బోధనా పద్దతుల్లో మార్పులు లాంటి కీలక సలహాలు, సూచనలు ప్రభుత్వానికి చేయనుంది. ఇందుకు కమిషన్ త్వరలోనే కార్యాచర ణ చేపట్టనున్నది. ప్రస్తుతం ప్రభుత్వం విద్యాకమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని మాత్రమే నియమిచింది.

ఇంకా సభ్యులను నియమించాల్సి ఉంది. వీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలోని సమస్యలను అంచనా వేయబోతున్నట్లు సమాచారం. అందరీ అభిప్రాయాలు తీసుకొని ఎలాంటి మార్పులు తీసుకొస్తే ప్రభుత్వ విద్య గాడీలో పడుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. విద్యాసంస్థల్లోని సమస్యల ను గుర్తించడంతోపాటు వాటికి పరిష్కార మార్గాలను సైతం ఈ కమిషన్ చూపనుంది.

ముందు అధ్యయనం..

ప్రభుత్వ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ విద్యాకమిషన్‌ను తీసు కొచ్చారు. ఆకునూరి మురళికి విద్యాశాఖపై మంచి పట్టుంది. ఏపీలో విద్యా వ్యవస్థపై పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది. అక్కడ చేపట్టిన ‘నాడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్ల స్వరూపాన్ని మార్చా రు. దాన్ని చూసే మన రాష్ట్రంలోనూ ‘మన ఊరు| బడి’ కార్యక్రమాన్ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. విద్యా వ్యవస్థలో ఏం చేయాలనే దానిపై కమిషన్ చైర్మన్‌కు ఓ అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సభ్యులను నియమించిన వెంటనే కార్యాచరణను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. స్కూ ళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపై కమిషన్ అధ్యాయనం చేసి, విద్యార్థులు, టీచ ర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, సంఘాలు, ఎన్‌జీవోలు, అధికారులు, మేధావులతో సంప్రదింపులు జరిపి నివేదికను రూపొందించే వీలుంది. 

నూతన విద్యావిధానాలు అమలు!

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాకమిషన్ సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలను మాత్రమే చూపనుంది. వాటిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వ బడుల్లో పక్కాగా ఇంగ్లీష్ మీడియం (ఇప్పటికే అమల్లోకి ఉంది), డిజిటల్ విద్యాబోధన, బెస్ట్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా అభ్యాసన పద్ధతుల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్రంలోని 26,845 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ముందస్తుగా పాఠశాల విద్యపై విద్యాకమిషన్ ఫోకస్ పెట్టనున్నట్లుగా సమాచారం. ఆతర్వాత ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యపై కమిషన్ దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడి పథకాలు మన దగ్గర అమలు!

విద్యా కమిషన్ పంజాబ్, ఢిల్లీ, హర్యాణా, కేరళ, పంజాబ్, ఏపీ రాష్ట్రాలతోపాటు వియ త్నాం, యూరప్, జర్మనీ, కెనడా, అమెరికా దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యావిధానాలను అధ్యయనం చేయనుంది. వీటిని మనదగ్గర కూడా అమలు చేసే వీలుం ది. రాష్ట్రంలో 26,845 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు 1,803 ఉన్నాయి. 14 పాఠశాలల్లో వెయ్యి మంది మాత్రమే చదువుతు న్నారు. 30 వరకు విద్యార్థులున్న స్కూళ్లు 9,043 ఉండగా, 31 నుంచి వంద మంది వరకు ఉన్న బడులు 10,562, 101 నుంచి 250 వరకు విద్యార్థులున్నవి 5,393 బడులున్నాయి.

251 నుంచి 1,000 మంది విద్యార్థు లున్న స్కూళ్లు 1,375 ఉన్నాయి.ప్రతీ ఏటా జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న స్కూళ్లు పెరుగుతుండటంతో వీటిపై కమిషన్ అధ్యయనం చేయనుం ది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, యూనివర్సిటీల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయి. సరిపడా నిధులు, సిబ్బందిని కేటాయించడంలేదు. వర్సిటీల్లో పరిశోధనలు తగ్గిపోతున్నాయి. కొన్ని విభాగాలకు హెచ్‌ఓడీలే ఉండడంలేదు. హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈక్రమంలోనే స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు సంస్కరణలను చేపట్టే విధంగా రానున్న రోజుల్లో విద్యాకమిషన్ విద్యావ్యవస్థను గాడీలో పెట్టేలా ఓ కార్యాచరణను రూపొందించుకోబోతుంది.