18-02-2025 06:04:46 PM
బైంసా (విజయక్రాంతి): రాబోయే వేసవికాలం దృష్ట్యా గ్రామపంచాయతీల నర్సరీలలో మొక్కలను ఎండిపోకుండా జాగ్రత్తగా కాపాడాలని డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి అన్నారు. బైంసా ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీవో శివలింగం, ఈసీ టిఏ లు ఎఫ్ఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సరీల మొక్కల సంరక్షణపై ముందు చూపుతో వ్యవహరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నీటి తడులను అందించి అవి వాడిపోకుండా చూడాలని కోరారు. అలాగే 2024- 25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉపాధి హామీ కూలీలకు ప్రోత్సహించి పనులు కల్పించాలని అన్నారు.