calender_icon.png 23 September, 2024 | 2:56 AM

యూరాలజీలో ఆవిష్కరణలపై దృష్టి

23-09-2024 12:59:17 AM

అత్యాధునిక వైద్య విధానాలపై యశోదలో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రాడికల్ ప్రొస్టాటెక్టోమీ నుంచి మూత్రపిండాల మార్పిడి వరకు యూరాలజీలోని అత్యాధునిక వైద్య విధానాలపై యశోద ఆస్పత్రిలో ‘లాప్ 2024’ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి సీనియర్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లంట్ సర్జన్ డాక్ట ర్ గుత్తా శ్రీనివాస్ మాట్లాడుతూ పీడియాట్రిక్ యూరాలజీ, యూరో రిక న్‌స్ట్రక్టివ్ యూరాలజీ, రీజనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఆవిష్కరణలపై దృష్టి సారించామ న్నారు.

ప్రొఫెసర్ డా.అనంత్‌కుమార్ మా ట్లాడుతూ యూరాలజీలో లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయన్నారు. దీంతో రోగులకు మరింత కచ్చితత్వం, మెరుగైన ఫలితాలు, జీవన నాణ్యతను అందిస్తున్నాయన్నారు. ఇలాంటి సదస్సులు నైపుణ్యం, నిరంతర అభివృద్ధికి రోజువారీ ఆచరణలో తాజా సాంకేతికతను చేర్చడానికి ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డా. అనంత్‌కుమార్, డా.అరవింద్ గన్‌పూలే, డాక్టర్ జమాల్ రిజ్వీ పాల్గొన్నారు.