calender_icon.png 13 January, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రవ్యోల్బణం డేటాగ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి

09-12-2024 12:00:00 AM

ఈ వారం మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  డిసెంబర్ 8: గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీ పీ గణాంకాలు, ఆదివారం వెల్లడైన ఆటో సే ల్స్ డేటాపై ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ స్పందించిన అనంతరం గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీకి అనుగుణంగా మార్కె ట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు తెలిపారు. 

ఈ వారం ద్వితీయార్థంలో జరిగే రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మార్కెట్‌కు కీలకమని అనలిస్టులు చెపుతున్నారు.  ఆరు వారాలు పాటు భారీ పతనాన్ని చవిచూసిన స్టాక్ మా ర్కెట్ వరుసగా నవంబర్ చివరి రెండువారాలపాటు కొంతమేర కోలుకున్నది. గత వా రం మొత్తంమీద సెన్సెక్స్ భారీగా 1,906 పా యింట్లు లాభపడి 81,706 పాయింట్ల వద్ద, ముగియగా, నిఫ్టీ 546 పాయింట్లు ఎగిసి 24,677 పాయింట్ల వద్ద ముగిసాయి.

ఈ వారం దేశీయంగా కీలకమైన నవంబర్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి డేటాపై ఇన్వెస్టర్ల దృష్టి ప్రధానంగా కేంద్రీకృతమై ఉం దని, అంతర్జాతీయంగా ప్రధాన దేశాలకు చెందిన పలు స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో గ్లోబల్ ట్రెండ్స్ తది తర అంశాలు స్టాక్ సూచీల కదలికల్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు తెలిపారు.

విదే శీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళి, రూపీడాలర్ ట్రెం డ్, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరల గమనం తదితరాలు కూడా మార్కెట్‌ను నిర్దేశిస్తాయని నిపుణులు వివరించారు.  అంతర్జాతీ య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రత్యేకించి ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా యుద్ద ఉద్రిక్తతలు, సిరియాలో తలెత్తిన తాజా సంక్షోభం మార్కెట్‌కు సవాళ్లు విసురుతాయని స్వస్తికా ఇన్వెస్ట్ మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు.

యితే ఇటీవల డాలర్ ఇండె క్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్  తగ్గుదల భార త్ వంటి వర్థమాన మార్కెట్లకు సానుకూలమని తెలిపారు. 

తిరిగి వస్తున్న ఎఫ్‌పీఐలు

వారం రోజుల్లో రూ.24,454 కోట్లు పెట్టుబడులు

దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి అదేపనిగా అక్టోబర్, నవంబర్ నెలల్లో నిధుల్ని తరలించిన  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి దేశంలో పెట్టుబడులకు ఉపక్రమించారు. డిసెంబర్ నెల తొలి వారంలో (6వ తేదీవరకూ) ఎఫ్‌పీఐలు రూ.24,454 కోట్లు దేశీయ స్టాక్స్‌లో నికరంగా ఇన్వెస్ట్ చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.94,017 కోట్లు, నవంబర్‌లో రూ.21,612 కోట్ల చొప్పున ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కె ట్లో నికర విక్రయాలు జరిపారు.  డిసెంబర్ తొలివారంలో చేసిన పెట్టుబడుల కారణంగా 2024లో ఇప్పటి వరకూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.9,435 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల గణాంకాల్లో వెల్లడవుతున్నది.

రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలు పర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెం డ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియే ట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.

ఇటీవలి దేశీయ మార్కెట్ కరెక్షన్‌తో తక్కువ విలువలపై స్టాక్స్ ట్రేడ్‌కావడం, ట్రంప్ టారీఫ్‌లు విధిస్తారన్న కారణంగా చైనా ఈక్విటీలపై అనిశ్చితి నెలకొనడంతో ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తున్నారని శ్రీవాస్తవ వివరించారు.