calender_icon.png 11 October, 2024 | 11:50 AM

గ్లోబల్ సంకేతాలు, డెరివేటివ్స్ క్లోజింగ్‌పై దృష్టి

26-08-2024 12:30:00 AM

ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలకు గ్లోబల్ సంకేతాలు, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు చెప్పారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు సమయం వచ్చిందంటూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొ వెల్ జాక్‌సన్‌హోల్  సింఫోజియంలో చేసిన స్పష్టమైన ప్రకటనతో ఈ సోమవారం మా ర్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమవుతుందని, అటుతర్వాత గ్లోబల్ మార్కెట్ల కదలికలకు అనుగుణంగా ట్రేడింగ్ జరుగుతుందని వారన్నారు.

ఫెడ్ చైర్మన్ కామెంటరీపై మార్కె ట్లు సోమవారం స్పందిస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ హెడ్ సిద్ధార్థ్ ఖెమ్కా చెప్పారు. ఆపై గ్లోబల్ సంకేతాలు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ వో) ఎక్స్‌ఫైరీవైపు ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతుందని,  స్టాక్ స్పెసిఫిక్‌గా ఈ వారం మార్కెట్ క్రమేపీ పెరగవచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.  గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 649 పాయింట్లు పెరిగి 81,086 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ 282 పాయింట్లు ర్యాలీ జరిపి 24,823 పాయింట్ల వద్ద నిలిచింది. యూఎస్ ఆర్థిక గణాంకాలు వడ్డీ రేట్ల కోతకు సంకేతాలివ్వడంతో భారత్ మార్కెట్ గతవారం ర్యాలీ జరిపిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ముగిసిన వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 1,608 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ ఫండ్స్ భారీగా రూ.13,021 కోట్లు నికర పెట్టుబడి చేశాయి. 

30న జీడీపీ డేటా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్ భారత్ జీడీపీ గణాం కాలు ఆగస్టు 30న వెలువడతాయి. అలాగే మౌలిక రంగాల ఉత్పత్తి డేటా కూడా వెల్లడవుతుంది. ఈ డేటాపై కూడా ఇన్వెస్టర్లు కన్నే సి ఉంచుతారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.

గ్యాప్‌అప్ ఓపెనింగ్

గత శుక్రవారం భారత మార్కెట్ ముగిసిన తర్వాత ఫెడ్ చైర్మన్ ప్రకటన వెలువడింది. పొవెల్ ప్రకటన తర్వాత యూఎస్ స్టాక్ సూచీలు రికార్డు గరిష్ఠస్థాయికి దూసుకెళ్లాయి. దీంతో గిఫ్ట్ నిఫ్టీ 90 పాయింట్ల మేర పెరిగి 24,948 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం నిఫ్టీ 90 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని సిద్దార్థ్ ఖెమ్కా  వివరించారు.  వచ్చే గురువారం ఆగస్టు 29 ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున మార్కెట్ కొంతమేర ఒడిదుడు కులకు లోనుకావచ్చని నిపుణులు తెలిపారు. సెప్టెంబర్ ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తున్నదని అటుపై వేగంగా రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డాయని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ నవీన్ కులకర్ణి చెప్పారు.