నిర్మల్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కళ్లు బాగా కనిపిస్తేనే మనిషి మనుగడ సాధ్యమని, కాబట్టి కళ్ల ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని నిర్మల్‌కు చెందిన కంటి వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కంటి వైద్యనిపుణులు, వైద్యిసిబ్బంది గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్ నుంచి డాక్టర్ లైన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. చిన్నపిల్లల్లో దృష్టి లోపాలని చిరు ప్రాయంలోనే గుర్తించాలన్నారు. ర్యాలీ లో కంటి వైద్యనిపుణులు కృష్టంరాజు, సురేశ్‌కుమార్, శృతివాస ప్రసాద్ పాల్గొన్నారు.