రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని ప్రైవేట్ పంక్షన్ హాల్‌లో శుక్రవారం ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా నాగుల సత్యనారాయణ గౌడ్‌తో ప్రమాణ స్వీకారం చేయిం చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నామన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు.
పదేళ్ల పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బతికి ఉండేలా పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి విచ్చేస్తున్నారని, అనేక అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. నేతన్నలెవ రూ ఆత్మహత్య చేసుకోవద్దని, ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్ర మంలో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ రియాజ్, వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.